తెరాస పార్టీ అధికార దుర్వినియోగం చేస్తోందని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, సంపత్‌కుమార్‌లతో కూడిన బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. న్యాయస్థానం సూచనల మేరకు నియోజక వర్గాల పునర్విభజన జరిగినట్లు మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర జనాభాకు చెందిన వివరాలు అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయని... కావాలనే ప్రకటించడం లేదని పేర్కొన్నారు.
రిజర్వేషన్‌ల ప్రకటన ఎన్నికల నోటిఫికేషన్ తేదీకి ఒక్కరోజు మాత్రం సమయం ఉంచడానికి కారణం ఏమిటో చెప్పాలని శశిధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ మార్చడానికి అవకాశం ఉందని.. సంక్రాంతి తరువాత ఎన్నికల ప్రకటన ఇవ్వాలని ఈసీ నాగిరెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఇవీ చూడండి:'ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి'