నల్గొండ జిల్లాకు చెందిన మహిళపై తొమ్మిదేళ్లుగా అత్యాచారం చేసిన 139 మంది నిందితులను వెంటనే గుర్తించాలని ఎమ్మార్పీఎస్ తెలంగాణ అధ్యక్షుడు రమేశ్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులను కలిసిన రమేశ్ మహిళ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలి: ఎమ్మార్పీఎస్ - mrps leaders demand justice for nalgonda women
నల్గొండ జిల్లాకు చెందిన మహిళ అత్యాచార కేసులో 139 మంది నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ తెలంగాణ అధ్యక్షుడు రమేశ్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్లో మహిళ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నల్గొండ మహిళ కేసులో నిందితులను అరెస్టు చేయాలి
ఈ కేసును సీఓఎస్కు బదిలీ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు ఎమ్మార్పీఎస్ నాయకులకు తెలిపారు. ఎస్టీ మహిళపై జరిగిన ఈ అమానవీయ సంఘటనను నిరసిస్తూ ఈనెల 26న హైదరాబాద్ పరిధిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సదరు మహిళకు ప్రాణాపాయం ఉందంటే తక్షణమే భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పంజాగుట్టు పోలీసులు చెప్పారు.