అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తు సరిగ్గా కనిపించకపోవటం వల్ల ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెరాస ఆశ్రయించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తు మరింత స్పష్టంగా కనిపించేలా మార్పులకు సీఈసీ అంగీకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు... కారును పోలి ఉండటం వల్ల తమ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారని తెరాస నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ట్రక్కు గుర్తుతో పాటు మరో మూడు గుర్తులను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. స్పందించిన సీఈసీ కారు గుర్తు మరింత స్పష్టంగా కనిపించేలా మార్పులు చేయడంతో పాటు ట్రక్కు గుర్తును తొలగిస్తున్నట్లు లిఖిత పూర్వకంగా తెలిపారని తెరాస ఎంపీ వినోద్ కుమార్ వెల్లడించారు.
ఇవీచదవండి: