తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీ జోగినపల్లి సంతోష్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాష పట్ల తన పెదనాన్న, సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. వేల పుస్తకాలు ఆపోశన పట్టిన కేసీఆర్ సారథ్యంలో తెలుగు భాష మరింత వికసిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2017లో రాష్ట్రంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఎంపీ పంచుకున్నారు.
"వేల పుస్తకాలు ఆపోశన పట్టిన ఘన వ్యక్తిత్వం, తెలుగు భాష పట్ల అనన్యసామాన్యమైన ప్రేమ, వెరసి మా పెదనాన్న, మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. వీరి సారథ్యంలో తెలుగు భాష మరింతంగా వికసిస్తుందనడంలో సందేహం లేదు." - జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎంపీ