తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు దిల్లీ వెళ్లనున్న ఎంపీ రేవంత్​ రెడ్డి.. పీసీసీ కోసమేనా? - రేవంత్​ రెడ్డి తాజా వార్తలు

తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్​, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి నేడు దిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు దిల్లీలో జరగనున్న డిఫెన్స్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినకు వెళ్తున్నారు.

mp revanth reddy will go to delhi on tomorrow
దిల్లీ వెళ్లనున్న ఎంపీ రేవంత్​ రెడ్డి.. పీసీసీ కోసమేనా?

By

Published : Dec 15, 2020, 8:51 PM IST

Updated : Dec 16, 2020, 1:10 AM IST

కాంగ్రెస్​ అధిష్ఠానం పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్​, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి దిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు దిల్లీలో జరగనున్న డిఫెన్స్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తినకు వెళ్తున్నారు. డిఫెన్స్‌ కమిటీలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి మాత్రమే సభ్యులు కావటంతో వెళ్లడం తప్పనిసరని రేవంత్‌ రెడ్డి వర్గీయులు తెలిపారు.

పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న ఈ సమయంలో.. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల అభిప్రాయాలపై పార్టీ అధిష్ఠానానికి నివేదిక అందిన తర్వాత పీసీసీ ఆశావహుల్లో ఒకరైన రేవంత్‌ రెడ్డి దిల్లీకి వెళ్తుండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అది కూడా రాహుల్‌ గాంధీతో కలిసి ఆ కమిటీ సమావేశంలో పాల్గొంటుండడం కీలకంగా భావిస్తున్నారు. రాహుల్‌ గాంధీతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం రేవంత్‌ రెడ్డికి రావటంతో పార్టీలో పీసీసీ ఆశిస్తున్న నాయకుల్లో ఆందోళన మొదలైంది.

సీనియర్లు కొందరు.. దిల్లీ వెళ్లి పీసీసీ అధ్యక్ష ఎంపికపై లాబీయింగ్‌ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో అపాయింట్‌మెంటు ఉండదని అధిష్ఠానం నుంచి సంకేతాలు రావటంతో ఎక్కడి వాళ్లు అక్కడ మిన్నకుండి పోయినట్లు తెలుస్తోంది. కానీ రేవంత్‌ రెడ్డికి అపాయింట్‌మెంటుతో సంబంధం లేకుండా రెండు, మూడు గంటలపాటు రాహుల్‌ గాంధీతో ఉండే అవకాశం రావటంతో.. వారి మధ్య పీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రస్తావన కూడా రావచ్చని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:నాలుగైదు వారాల్లో కరోనా టీకా: ప్రజారోగ్యశాఖ డైరెక్టర్​

Last Updated : Dec 16, 2020, 1:10 AM IST

ABOUT THE AUTHOR

...view details