cantonment issue in parliament : సికింద్రాబాద్ కంటోన్మెంట్ రహదారుల మూసివేత అంశం పార్లమెంటులో మరోసారి చర్చకు వచ్చింది. తరుచూ స్థానిక మిలటరీ అధికారులు(ఎల్‌ఎంఏ) మూసివేయడంతో ఆయా మార్గాల్లో ప్రయాణించేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. 2016 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడెప్పుడు.. ఎన్ని సార్లు.. ఏ రహదారులు మూసివేశారు అని అడిగారు. రహదారులు తెరవాలంటూ వస్తున్న వినతులపై రక్షణ శాఖ స్పందించకపోవడాన్ని రేవంత్‌రెడ్డి నిలదీశారు. దీనికి రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ సమాధానం చెప్పారు.
cantonment issue in parliament : పార్లమెంటులో కంటోన్మెంట్ సమస్య
cantonment issue in parliament : సికింద్రాబాద్ కంటోన్మెంట్ రహదారుల మూసివేత అంశంపై పార్లమెంట్లో మరోసారి చర్చ జరిగింది. తరుచూ స్థానిక మిలటరీ అధికారులు ఆయా మార్గాలు మూసివేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు.
పార్లమెంటులో కంటోన్మెంట్ సమస్య
2018లో రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో స్థానిక మిలటరీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. 2014లో హైకోర్టు ఆదేశాలతో అవసరాన్ని బట్టి కొన్ని రహదారులను ఆయా సమయాల్లో మూసి వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఇదీ చదవండి:నాకు నచ్చినప్పుడు రాజ్యసభకు వెళ్తా: జస్టిస్ రంజన్ గొగొయి