ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ సంధించారు. అశోక్‌గజపతిరాజుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని లేఖలో పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి వ్యక్తిగత విమర్శలు చేశారని ఆక్షేపించారు.
MP Raghurama : ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ... - మాన్సాస్ ట్రస్టు
అశోక్‌గజపతిరాజుపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. పార్టీ నేతలను జగన్ అదుపు చేయాలని లేఖలో కోరారు.
Raghurama Letter to Jagan
అశోక్‌గజపతిరాజుపై విజయసాయిరెడ్డి సహా అనేకమంది అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహించారు. పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అదుపు చేయాలని కోరారు. మాటలు అదుపులో పెట్టుకోవాలని చెప్పాలంటూ లేఖలో రాశారు.