తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా?: ఎంపీ రఘురామ

ఏపీ సీఎం జగన్​ డిక్లరేషన్ ఇవ్వకుండా శ్రీవారిని దర్శించుకోవడాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తే నిబంధనలు ఉల్లంఘిస్తే... ప్రజలకు ప్రభుత్వ నిర్ణయాలపై గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఏపీ ఖ్యాతి దిగజారేలా వ్యవహరిస్తే... ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు.

ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా?: ఎంపీ రఘురామ
ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా?: ఎంపీ రఘురామ

By

Published : Sep 24, 2020, 10:55 PM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం దురదృష్టకరమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సనాతన సంప్రదాయాలు, ఆచారాలు గౌరవించాలని కోరినా... సీఎం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను ముఖ్యమంత్రి ఉల్లంఘించారని ఎంపీ విమర్శించారు. కొవిడ్​ దృష్ట్యా బాధ్యతతో వ్యవహరించాల్సిన సీఎం.. నిర్లక్ష్యంగా మాస్కు కూడా ధరించలేదన్నారు. ముఖ్యమంత్రే ఇలా చేస్తే ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు గౌరవం ఎలా ఉంటుందని ఎంపీ ప్రశ్నించారు.

ఏపీ ఖ్యాతి దిగజార్చారు..

మంత్రి కొడాలి నాని ప్రధాని మోదీ, యూపీ సీఎంపై చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎంపీ రఘురామ హితవు పలికారు. మంత్రిగా కాదు వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశానని కొడాలి అనడం బాధాకరమన్నారు. మనోభావాలు దెబ్బతీసేలా కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. మంత్రిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తిరగబడి దాడి చేసే రోజు వస్తుందని హెచ్చరించారు. ఏపీ ఖ్యాతి దిగజారేలా వ్యవహరించవద్దని సూచించారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశాన్ని వైకాపా ఎంపీలు ప్రస్తావించలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి అన్ని మతాలను సమానంగా చూడాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు.

ఇదీ చదవండి :'గాంధీ, ఉస్మానియా తర్వాత మహబూబ్​నగర్​లోనే'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details