తెలంగాణ

telangana

By

Published : Sep 26, 2022, 12:53 PM IST

ETV Bharat / state

'దళిత, గిరిజన బంధు మాదిరిగా రజక బంధు ఏర్పాటు చేయాలి'

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు సముచితమైన గౌరవ మర్యాదలు దక్కడం లేదని భాజపా ఎంపీ కె.లక్ష్మణ్ విచారం వ్యక్తం చేశారు. లోయర్ ట్యాంక్​బండ్ పరిధిలోని ఎల్చగూడలోని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 127 జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్​ దళిత, గిరిజన బంధు ఏర్పాటు చేసినట్లే రజకులకూ రజక బంధు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.

Chakali Ailamma Jayanti celebrations
Chakali Ailamma Jayanti celebrations

చాకలి ఐలమ్మ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధురాలని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. భూమి శిస్తు, పన్నుల విషయంలో పటేల్, పట్వారీలను వ్యతిరేకించిన చాకలి ఐలమ్మ.. అంతటి యోధురాలి విగ్రహం ఇంతవరకు సీఎం కేసీఆర్ ట్యాంక్​బండ్​పైన ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.

హైదరాబాద్​లో లోయర్ ట్యాంక్​బండ్ పరిధిలోని ఎల్చగూడలో తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన చాకలి ఐలమ్మ 127వ జయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఆయన నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ దళితలకు, గిరిజనులకు దళిత, గిరిజన బంధు ఏర్పాటు చేసినట్లే రజకులకు కూడా రజకబంధు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. రజక బంధు ప్రకటించిన తర్వాతే తెరాస మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనాలని ఆయన సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details