'ఎంఎంటీఎస్‌ను యాదగిరిగుట్ట వరకు పొడిగించాలి' తెలంగాణ రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నందున రైల్వే అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే చేపట్టాలని రైల్వే జీఎం గజానన్ మాల్యాను కోరినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల విస్తరణకు సంబంధించి రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్‌తో కలిసి హైదరాబాద్ రైల్ నిలయంలో జీఎంతో సమావేశమయ్యారు.
తెలంగాణకు రావాల్సిన కొత్త రైల్వే లైన్లు, ఇతర ప్రాజెక్టుల గురించి జీఎం దృష్టికి తీసుకు వెళ్లామని ఎంపీ లింగయ్య యాదవ్ తెలిపారు. తమ సమస్యలపై జీఎం సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.
పెండిగ్ ప్రాజెక్టులు... రైల్వే లైన్ల విస్తరణ
- చిట్యాల నుంచి జగ్గయ్య పెట్ కొత్త లైన్
- బీబీనగర్ - నడికుడి వరకు డబుల్ లైన్
- దామరచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో అల్ట్రా పవర్ ప్రాజెక్టు...రెండేళ్ల లో పూర్తి చేయాలి
- డోర్నకల్ ...గద్వాల్ మీదుగా సూర్యాపేట...నల్గొండ..నాగర్ కర్నూల్ కొత్త లైన్లు వేయాలి
- హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలు మార్గంతో పాటు పనులు పూర్తి చేయాలి
- మిర్యాలగూడ స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలి
- భువనగిరి రైల్వే స్టేషన్లో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు ఆపాలి
- ఆలేరు రైల్వే స్టేషన్లో పద్మావతి...దక్షిణ్... మంగళూరు ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలి