తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్మిక సంఘాల అధ్యక్ష పదవులకు కవిత రాజీనామా - trade unions

ఎంపీ కవిత పలు సంఘాల గౌరవాధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. వీటికి తగినంత సమయం కేటాయింకపోవడమే కారణమని వెల్లడించారు. అధికారికంగా పదవిలో లేకపోయినా కార్యాచరణలో మర్పు ఉండదని స్పష్టం చేశారు.

kavita

By

Published : Feb 2, 2019, 1:24 PM IST

mp
నిజామాబాద్ లోక్​సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత పలు గౌరవాధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఉన్న రాష్ట్ర బొగ్గుగని, విద్యుత్ కార్మిక సంఘాల అధ్యక్షత బాధ్యతల నుంచి ఎంపీ తప్పుకున్నారు. వీటితో పాటూ అంగన్​వాడి ఉపాధ్యాయులు, హెల్పర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవులను కూడా వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాజీనామా లేఖను ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శులకు పంపించారు.
పార్లమెంటరీ అంచనాల కమిటీ సభ్యురాలు, కామన్వెల్త్ పార్లమెంట్ అసోషియేషన్ నామినేటెట్ మెంబర్​, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ కమిషనర్​ వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కేంద్ర సంస్థలతో పాటూ దేశ విదేశాల్లో అధికారికంగా పర్యటనలు చేశారు. సంఘాలకు గౌరవ అధ్యక్షురాలిగా తగిన సమయం కేటాయించలేకపోవడం వల్లే వైదొలగుతున్నట్లు తెలిపారు.


ABOUT THE AUTHOR

...view details