తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల అస్వస్థతకు భారలోహం సీసమే కారణం..!: జీవీఎల్ - Godavari District Latest News

ఏపీలోని ఏలూరులో ప్రజల అస్వస్థతకు భారలోహం సీసమే కారణమని భాజపా ఎంపీ జీవీఎల్‌ పేర్కొన్నారు. రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్‌ లోహాల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని అన్నారు. సీసం, నికెల్‌ లోహాల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు దిల్లీ ఎయిమ్స్‌ పరీక్షల్లో తేలిందని జీవీఎల్‌ వెల్లడించారు.

gvl
ఏలూరులో ప్రజల అస్వస్థతకు భారలోహం సీసమే కారణం..! : జీవీఎల్

By

Published : Dec 8, 2020, 11:54 AM IST

ఆంధ్రప్రదేశ్​ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజల అస్వస్థతకు భారలోహం సీసమే కారణమని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్‌ అనే లోహాల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు దిల్లీ ఎయిమ్స్‌ పరీక్షల్లో తేలిందని తెలిపారు.

ఈ పరీక్షల వివరాలను మంగళగిరి ఎయిమ్స్‌ ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లు చెప్పారు. స్థానికంగా ఉన్న తాగునీరు, పాల నమూనాలను పంపాలని దిల్లీ ఎయిమ్స్‌ నిపుణులు ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. సీసం కారణంగానే న్యూరో టాక్సిక్‌ లక్షణాలు కనిపిస్తాయని, బ్యాటరీల్లో ఉండే ఈ లోహం తాగునీరు, పాల ద్వారా రోగుల శరీరంలోకి వెళ్లి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి :అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: ఏపీ సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details