బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించడం సంతోషంగా ఉందని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. బండారు దత్తాత్రేయ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మంచి రాష్ట్రానికి నియమితులయ్యారని పేర్కొన్నారు. దత్తాత్రేయ ఎన్నో ఏళ్లుగా పార్టీకీ సేవలందించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కొనియాడారు. దత్తాత్రేయను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతాలు, దేశం కోసం పనిచేసిన వారికి సరైన గుర్తింపు రావడం శుభపరిణామన్నారు. ఇది రాజకీయాల్లో పనిచేసే కార్యకర్తలకు స్ఫూర్తి, ప్రేరణ అని వ్యాఖ్యానించారు. బండారు దత్తాత్రేయ ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంది. రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
దత్తాత్రేయను కలిసిన తెరాస ఎంపీ డీఎస్ - bandaru dattatreya
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయను రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేసమయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా అభినందనలు తెలిపారు. గవర్నర్‌గా నియమించడం సంతోషంగా ఉందని డీఎస్ అన్నారు .
bandaru dattatreya