తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ పేరు భాగ్యనగర్​గా మారుస్తాం: అర్వింద్ - ghmc elections 2020 campaign

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్, ఒవైసీ బ్రదర్స్, కాంగ్రెస్​పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్​ కుమార్ నిప్పులు చెరిగారు. ప్రజాక్షేమం పట్టని పార్టీలకు హైదరాబాద్​లో చోటు లేదన్నారు. భాజపాకు ఓటేస్తే.. హైదరాబాద్​ను భాగ్యనగర్​గా మారుస్తామని ప్రకటించారు.

mp arvind said we will change the name of Hyderabad to Bhagyanagar
హైదరాబాద్​ పేరు భాగ్యనగర్​గా మారుస్తాం: అర్వింద్

By

Published : Nov 27, 2020, 11:52 AM IST

మోదీ ఈరోజు దేశానికి సంబంధించిన వ్యక్తే కాకుండా.. ప్రపంచానికే పెద్ద శక్తిగా ఎదిగారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్​ కుమార్ అభివర్ణించారు. కేసీఆర్ మూసి ప్రక్షాళన చేసి.. గోదావరికి అనుసంధానం చేస్తాడంటా.. అందులో బోటింగ్ పెడతాదంటా అని ఎద్దేవా చేశారు.

పెద్ద పెద్ద వాళ్లను వంగిపిస్తాం... అని ప్రసంగించే ఒవైసీ బ్రదర్స్ రాజశేఖర్ రెడ్డి దగ్గర వంగి వంగి దండాలు పెట్టిన విషయం మరువద్దని గుర్తు చేశారు. ఒక సారి భాజపా అధికారంలోకి వస్తే మళ్లీ లేవకుండా వంగిపిస్తామని అన్నారు. అంతేగాకుండా హైదరాబాద్​ను భాగ్యనగర్​గా.. నిజామాబాద్​ను ఇందూరుగా మారుస్తామని ప్రకటించారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ పాతబస్తీలోని లలితా బాగ్, జంగంమేట్, గౌలిపురా, ఉప్పుగూడలో భాజపా అభ్యర్థులకు మద్దతుగా భారీ రోడ్ షో నిర్వహించారు.

ఇదీ చూడండి :కమీషన్ల కోసం కొత్త సచివాలయం: బండి

ABOUT THE AUTHOR

...view details