తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదల కాగానే భాజపాలోకి స్వీకరిస్తామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ (Nizamabad MP Arvind) వెల్లడించారు. పెట్టిన కేసులే మళ్లీ మళ్లీ పెట్టవద్దని హైకోర్టు చీవాట్లు పెట్టినా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంచల్గూడ జైలులో ఉన్న తీన్మార్ మల్లన్నను (Teenmar Mallanna) అర్వింద్ ములాఖత్ ద్వారా కలిశారు.
గత 37 రోజుల నుంచి జైలులో ఉన్న తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna).. ఆత్మ విశ్వాసంతో ఉన్నారని ఎంపీ తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ (kcr and ktr) అవినీతి గురించి మాట్లాడితే అక్రమంగా కేసులు బనాయించి జైలులో పెట్టారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ అప్రజాస్వామికంగా నియంతలా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్‌కు బుద్ది చెబుతారన్నారు. మల్లన్న (Teenmar Mallanna) జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రభుత్వం మారే వరకు నిద్రపోడని చెప్పారు. ప్రజల కోసం కోట్లాడే వారిపై దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
'' ఇవాళ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna)ను చంచల్గూడ జైలులో కలవడం జరిగింది. ఆయన ఒక యోధుడు. ఒక్కడు ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను మూడు చెరువుల నీళ్లు తాగించారు. మీరు చేసే అవినీతి, అక్రమాల గురించి ప్రజల తరఫున మాట్లాడే వ్యక్తిని.. జైళ్లో మూలకు చివరి సెల్లో వేశారట. అతన్ని మానసిక క్షోభకు గురిచేయాలని ఇదంతా చేస్తున్నారు. ఆయనేదో టెర్రరిస్టు అన్నట్లు.. ట్రీట్ చేస్తున్నారు. ఇది సరికాదు. 37 రోజుల నుంచి జైళ్లో ఉండి కూడా... అన్నీ భరించుకుంటూ.. ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు. ఇటువంటి యోధుడు భాజపాలో చేరితే... మేం స్వీకరిస్తాం. జైలు నుంచి బయటకు రాగానే... భాజపాలో చేరమంటాం. కేంద్ర హైకమాండ్ కూడా చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చే వరకు నిద్రపోడు అతను. ఇవాళ హైకోర్టు ప్రభుత్వాన్ని ఎన్ని చీవాట్లు పెట్టినా... బుద్ధి మాత్రం రావట్లేదు. ఇంకా మల్లన్నను హుజూరాబాద్ ఉపఎన్నికకు దూరంగా ఉంచేందుకు జైళ్లో పెట్టారు. ఆయన చేసిన నేరం ఏం లేదు.. కేసుల్లో ఒక్క దాంట్లో కూడా దమ్ము లేదు. పనికి మాలిన కేసులు పెట్టారు. ''
- ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ...''
Mp Arvind: 'మల్లన్న జైలు నుంచి రాగానే భాజపాలోకి చేర్చుకుంటాం' ఇదీ చూడండి: Teenmaar Mallanna arrest : తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్