Mother Complaint on Son: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దివంగత పులపర్తి నారాయణమూర్తి సతీమణి వెంకటలక్ష్మి.. తన కుమారుడు రవి కుమార్‌పై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆమె.. రవి కుమార్ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. ఈ నెల 7న ఏడుగురు అనుచరులతో ఇంటికి వచ్చి.. దౌర్జన్యంగా కారు, జీపు తీసుకెళ్లాడని తెలిపింది. తన భర్తను ఇబ్బంది పెట్టి ఆస్తులు రాయించుకున్నాడని పేర్కొంది. రవి కుమార్ నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.
కుమారుడిపై తల్లి ఫిర్యాదు.. తన కారు లాక్కెళ్లడని..! - స్పందన కార్యక్రమం తాజా వార్తలు
Mother Complaint on Son: కుమారుడు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తతో బలవంతంగా ఆస్తులు రాయించుకోవడమే కాకుండా.. తాజాగా కారు లాక్కెళ్లడని ఆమె ఆరోపించింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో.. స్పందన కార్యక్రమంలో ఆమె ఫిర్యాదు చేసింది.
Mother Complaint on Son