భారీ వర్షాల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మొయిన్ చెరువు కట్ట తెగిపోయింది. ఫలితంగా పటేల్ నగర్, ప్రేమ్ నగర్, బాపు నగర్ ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరి.. నిన్న సాయంత్రం నుంచి ఆయా కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తెగిపోయిన మొయిన్ చెరువు కట్ట.. కాలనీల్లోకి వరద నీరు
భారీ వర్షాలు భాగ్యనగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటితో కాలనీలన్నీ చెరువుల్లా దర్శనమిస్తుండగా.. ఇళ్లల్లోకి చేరిన నీటితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద నీటి ఉద్ధృతి ఎప్పుడూ తగ్గుతుందా అని ఎదురుచూస్తున్నారు.
తెగిపోయిన మొయిన్ చెరువు కట్ట.. కాలనీల్లోకి వరద నీరు
మరోవైపు మూసీ పరీవాహక ప్రాంతాలైన నల్లకుంట డివిజన్లోని రత్న నగర్, నరసింహ బస్తీ, గోల్నాక డివిజన్లోని లంక బస్తీ, కృష్ణా నగర్లు పూర్తిగా నీట మునిగాయి. వరద తీవ్రత తగ్గకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చూడండి.. విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం