తెలంగాణలో జరుగుతున్న శాసనసభ్యుల ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సీనియర్ నేత వీరప్ప మొయిలీ సమావేశమయ్యారు. పార్టీ ఫిరాయింపులు బ్లడ్ క్యాన్సర్ లాంటివని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడేలా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేలా వీటిపై పోరాటం చేస్తామని మొయిలీ తెలిపారు.
అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హస్తం గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.