తెలంగాణ

telangana

ETV Bharat / state

FOOD PROGRAM: ఆకలి పారదోలడంలో తెలంగాణ భేష్‌ - తెలంగాణ వార్తలు

ఆకలి, పోషకాహార లోప సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ భేష్‌ అని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం భారత సంచాలకుడు బిషో పారాజులి కొనియాడారు. ఈ సదస్సులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) హైదరాబాద్‌ నుంచి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్(KCR) నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార భద్రత కార్యక్రమాలను కవిత వివరించారు.

mlc kavitha, world food program
ఎమ్మెల్సీ కవిత, ప్రపంచ ఆహార కార్యక్రమం

By

Published : May 28, 2021, 12:08 PM IST

ఆకలి, పోషకాహార లోప సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ సర్కారు అద్భుతంగా పనిచేస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం భారత సంచాలకుడు బిషో పారాజులి ప్రశంసించారు. ఆకలి పారద్రోలడానికి ప్రభుత్వం, ప్రైవేటు రంగాలు, ఎన్జీవోలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమం భారత విభాగం దిల్లీ నుంచి గురువారం నిర్వహించిన దృశ్యమాధ్యమ సదస్సులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) హైదరాబాద్‌ నుంచి పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార భద్రత కార్యక్రమాలను కవిత వివరించారు. ఆరోగ్యలక్ష్మీ పథకంలో భాగంగా ప్రభుత్వాసుపత్రుల్లో బాలింతలు, గర్భిణులతో పాటు సహాయకులకూ పౌష్టికాహారం అందించడం గొప్ప విషయమని పారాజులి కొనియాడారు. అన్నపూర్ణ కేంద్రాలు, ఫుడ్ బ్యాంకులతో పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నట్లు కవిత తెలిపారు.

ఇదీ చదవండి:inflation: కరోనా వేళ.. ద్రవ్యోల్బణానికి రెక్కలు

ABOUT THE AUTHOR

...view details