తెలంగాణ మహిళా రచయితల ఫోరానికి సంబంధించిన అక్షరయాన్ వెబ్సైట్ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. మహిళల వేధింపులపై అక్షరాలే ఆయుధాలుగా రచనలతో సమాజంలో మార్పు కోసం అక్షరయాన్ తెలుగు మహిళా రచయితల ఫోరం కృషి చేస్తోందని కవిత అభినందించారు. తమిరిళ జానకి కవితల పోటీలో గెలిచిన రచయిత్రులకు బహుమతులు ప్రదానం చేశారు.
'అక్షరయాన్ వెబ్సైట్' ఆవిష్కృతం.. బహుమతుల ప్రదానం - తెలంగాణ వార్తలు
అక్షరయాన్ వెబ్సైట్ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. సమాజంలో మార్పు కోసం మహిళా రచయితల ఫోరం కృషి చేస్తోందని కొనియాడారు. పలు పుస్తకాలను ఆవిష్కరించారు.
అక్షరయాన్ వెబ్సైట్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
పలువురు మహిళ రచయితలు రాసిన పుస్తకాలను కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఉద్యాన రంగం, రైతుల బలోపేతమే లక్ష్యం: వీసీ నీరజ ప్రభాకర్