దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల తర్వాతనైనా సీఎం కేసీఆర్‌కు కనువిప్పు కలగాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఎవరు గెలిచారు అనే దాని కంటే తెరాస ఓటమికి కృతనిశ్చయంతో... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఏకపక్షంగా నిలిచినట్లు భావించక తప్పదన్నారు.
ఇప్పటికైనా తెరాసకు కనువిప్పు కలగాలి: జీవన్‌రెడ్డి - తెలంగామ వార్తలు
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలతోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనువిప్పు కలగాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఒక విధంగా నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసినట్లు భావించాలని పేర్కొన్నారు.
ఇప్పటికైనా తెరాసకు కనువిప్పు కలగాలి: జీవన్‌రెడ్డి
సీఎం కేసీఆర్ కేవలం ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలు హామీలకే పరిమితం కాకుండా అమలు చేయాలన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ప్రభుత్వం పనిచేయాలని ఆశిస్తున్నట్లు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.