ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం... తమ పార్టీ అజెండాగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ప్రతిపక్ష పార్టీగా తమ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. వీఆర్ఎస్ అనేది కార్మికుల ఆలోచన ప్రకారంగా ఉంటుందని తెలిపారు. వీఆర్ఎస్పై సీఎం నిర్ణయం తీసుకుంటే న్యాయపోరాటం చేస్తామన్నారు.
'ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే... యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం'
ఆర్టీసీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేటుపరం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ జాతీయపరం చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి వల్లే ఆర్టీసీ సమస్య జటిలం అయిందన్నారు.
mlc jeevan reedy fairs on trs government