రాష్ట్రంలో సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. 150వ గాంధీ జయంతి సందర్భంగా క్షమాబిక్షపై నిర్ణయం తీసుకుంటున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చినా... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశలో నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలి సభాముఖంగా కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు జీవన్‌రెడ్డి గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని ముఖ్యమంత్రిని కోరారు.
వచ్చే నెల రెండో తేదీన 151వ గాంధీ జయంతి సందర్భంగా క్షమాభిక్షను ప్రసాదించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. సీఎం నిర్ణయం తీసుకోవటంలో జరుగుతున్న జాప్యం, జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారికి వయస్సు మీద పడుతుండటం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. మండలిలో ప్రస్తావన చేసి... ఆరు నెలలు గడిచినా నిర్ణయం వెలువడకపోవడం వల్ల మరొకసారి గుర్తు చేసేందుకు లేఖ రాయక తప్పలేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:రెండుపడక గదుల ఇళ్లను భట్టికి రేపు కూడా చూపిస్తా : తలసాని