తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ సందడి షురూ - MLC CANDETS

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఇవాళ నోటిఫికేషన్ విడుదల అయినందున పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల కోటాలో 5స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయింది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్​ దాఖలు

By

Published : Feb 25, 2019, 6:38 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్​ దాఖలు
శాసనమండలిలో ఖాళీ అవుతున్న 5 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అధికార తెరాసలో ఇప్పటికే అభ్యర్థుల పేర్లు ఖరారు అయినందున.. వారు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. తెరాస అభ్యర్థులుగా మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎగ్గె మల్లేశం, మిత్రపక్షం ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్‌ నామినేషన్‌ సమర్పించారు.

కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్-ఆదిలాబాద్‌ పట్టభద్రులు, కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్-ఆదిలాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ, హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.

మార్చి 5 వరకు అవకాశం

మార్చి 5వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 6న పరిశీలన, 8న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరుగనుంది. 26న ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో నియమావళి అమల్లోకి వచ్చింది.

ఇవీ చదవండి:నేడే ఎమ్మెల్సీ నగారా

ABOUT THE AUTHOR

...view details