ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనమండలిని చిన్నచూపు చూశారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. పెద్దల సభగా చెప్పుకునే... శాసన మండలికి కనీసం హాజరు కాకపోవడం మండలిని అగౌరవ పరచినట్లేనని అభిప్రాయ పడ్డారు. నూతన రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధికంగా గిరిజనులే నష్టపోయారని తెలిపారు. వీరికి రిజర్వేషన్ల విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పక్కన పెడుతోందనని ప్రశ్నించారు. లోకాయుక్త భర్తీ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని జీవన్రెడ్డి నిలదీశారు. ఖైదీల క్షమాభిక్ష అంశంపై సర్కారు తాత్సార ధోరణి అవలంభిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి మండలి సమావేశాలకు హాజరు కాకపోవడం వల్ల ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకలేదని అన్నారు.
'శాసన మండలిని ముఖ్యమంత్రి అగౌరవ పరిచారు' - mlc
ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనమండలికి గౌరవం ఇవ్వడంలేదని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. సమావేశాలను కేవలం ఆర్థికమంత్రితోనే సరిపెట్టడమంటే.. మండలిని అగౌరవపరిచినట్లేనని చెప్పారు. ఎంతో ముఖ్యమైన అంశాలకు సరైన సమాధానాలు లభించలేదని జీవన్రెడ్డి ఆక్షేపించారు.
'శాసన మండలిని ముఖ్యమంత్రి అగౌరవ పరిచారు'