శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరాస అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హోంమంత్రి మహమూద్ అలీని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. మరో స్థానాన్ని మిత్రపక్షం ఎంఐఎంకు కేటాయించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా అభ్యర్థులను ఖరారు చేశారు. నాలుగు స్థానాలను ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఓసీలకు కేటాయించిన తెరాస.. మరో స్థానాన్ని ఎంఐఎంకు అవకాశం ఇచ్చింది. మార్చి 12న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. తెరాస అభ్యర్థులు శనివారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీల ఖరారు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ఒక సీటును మిత్రపక్షం ఎంఐఎంకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్