MLA Vamshi followers humgama: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ అనుచరులు వీరంగం సృష్టించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై మద్యం మత్తులో బాణాసంచా కాల్చారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తున్నారని ప్రశ్నించిన వాహనదారులతో వాగ్వాదానికి దిగారు. సుమారు గంటకు పైగా హైవేపై వాహనాలను నిలిపేశారు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఎంతసేపు ఆగాలని అడిగిన కొందరిపై వంశీ అనుచరులు దాడి చేసేందుకు యత్నించారు. ఇంత జరిగినా పోలీసులు దరిదాపుల్లో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.