అసెంబ్లీలో తాము అడిగే ప్రశ్నలకు సమాధానం వస్తుందని ఆశించామని, కానీ తమ ఆశలన్నీ ఆడియాశలయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఉద్యమ సమయంలో పోరాడిన యువత కోసం రాష్ట్రం ఏర్పడ్డాక.... భారీ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని హైదరాబాద్‌లో మండిపడ్డారు. యువ న్యాయవాదుల స్టైయిఫండ్‌పై... సభలో ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆక్షేపించారు. సాగునీటి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన వారికి పరిష్కారం లభించలేదని విమర్శించారు. విభజన చట్టంలోని పెండింగ్ హామీలు అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానితో మాట్లాడాల్సిన అవసరం ఉందని శ్రీధర్ బాబు సూచించారు.
నిరుద్యోగులకు తీరని అన్యాయం: శ్రీధర్ బాబు
తెలంగాణ వచ్చాక భారీ ఉద్యోగ నియమకాలు జరుగుతాయని కలలు కన్న యువకులను రాష్ట్రప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను ప్రభుత్వం త్వరగా అమలయ్యేలా చూడాలన్నారు.
నిరుద్యోగులను నిండా ముంచిన కేసిఆర్: శ్రీధర్ బాబు