ఒకవైపు చైనా, భారత్‌కి సరిహద్దులపై యుద్ధవాతావరణ చోటుచేసుకుంటుంటే... మన ఫోన్లలో చైనా యాప్‌లు వాడటం సరికాదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సైనికులకు మద్దతుగా చైనాకు సంబంధించిన ప్రతి యాప్‌ను తొలిగించాలని కోరారు. దీనితో పాటు నగరంలోని చైనీస్ ఫాస్ట్ ఫుడ్ పేరుతో ఉన్న హోటల్స్ వాటి పేరును మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'భారత సైన్యానికి మద్దతుగా చైనా యాప్స్ తొలిగించండి'
చైనాతో భారత సైన్యం యుద్ధం చేస్తుంటే.. మనవంతుగా మన ఫోన్లో ఉన్న చైనా యాప్‌లను ఒక్క వేలుతో తొలిగించి.. మద్దతు తెలుపాలని ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. చైనాకు సంబంధించిన యాప్‌లను తొలగించాలన్నారు.
'భారత్ సైన్యానికు మద్దతుగా చైనా యాప్స్‌ను తొలగించండి'