తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేరుకుపోయిన చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలి' - జీహెచ్​ఎంసీ వార్తలు

రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించాలని గోషామహల్​ ఎమ్మెల్యే రాజా సింగ్​.. జీహెచ్​ఎంసీ కమిషనర్​కు విజ్ఞప్తి చేశారు. చెత్త నుంచి వచ్చే దుర్వాసన వల్ల ప్రజలకు రోగాలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా కోరారు.

gosha mahal, mla rajasingh, dump on road sides
గోషామహల్​, ఎమ్మెల్యే రాజాసింగ్​

By

Published : Jan 3, 2021, 1:09 PM IST

గోషామహల్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్.. జీహెచ్​ఎంసీ కమిషనర్​కు​ విజ్ఞప్తి చేశారు. రహదారుల పక్కన చెత్త పేరుకుపోవటంతో వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని పేర్కొన్నారు. మూడు రోజులుగా మున్సిపల్ అధికారులతో పాటు కమిషనర్​కు చెత్త సమస్య గురించి తెలిపినా వారినుంచి ఎటువంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ వైపు కొవిడ్​తో ప్రజలు భయాందోళనలో ఉన్నారని.. చెత్త నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్, అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే చెత్తను తొలగించే చర్యలు చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి:అధికార ఠీవికి నిదర్శనంగా నిలిచిన వాహనాల వేలం

ABOUT THE AUTHOR

...view details