రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొన్నాయని.. వాటి పరిష్కారం కోసం తమ వాణిని అసెంబ్లీలో వినిపిస్తామని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు తెలిపారు. గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు ప్లకార్డులతో నిరసన తెలుపుతూ అసెంబ్లీలోకి వెళ్లారు.
అసెంబ్లీలో గొంతు నొక్కుతున్నారు.. సమయం ఇవ్వాలన్న రాజాసింగ్ - ts assembly monsoon session 2020
గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ నివాళులు అర్పించారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ అసెంబ్లీలోకి వెళ్లారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.
అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారన్నారు: రాజాసింగ్
అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారన్న రాజాసింగ్.. కేసీఆర్ తమకు సభలో సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఐఎంకి ఎంత సమయం ఇస్తున్నారో? అంతే సమయం ఇవ్వాలని కోరారు. ఎల్ఆర్ఎస్పై వాయిదా తీర్మానం ఇచ్చామని.. దానిపైన చర్చ జరగాలని ఎమ్మెల్సీ రాంచందర్ రావు కోరారు. పీఆర్సీ, ఐఆర్ సమస్యలపై ఉభయ సభల్లో గళం విప్పుతామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్
Last Updated : Sep 8, 2020, 1:52 PM IST