హైదరాబాద్ కింగ్ కోఠి, ఈఎన్‌టీ ఆసుపత్రులను గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Mla raja singh) సందర్శించారు. ఫంగస్, కరోనా రోగులకు ఓఆర్‌ఎస్, మంచినీళ్ల బాటిళ్లను పంపిణీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యులు రిస్క్ తీసుకుని మంచి వైద్యం అందిస్తున్నారని.. వారందరికీ తన వంతుగా కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిలో తిరుగుతున్నంత సేపు రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి బాధ కలిగిందన్నారు.
Mla visit: 'రోడ్లపై తిరిగేవాళ్లను కరోనా రోగుల వద్దకు తీసుకెళ్లండి'
రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరుగుతున్న వాళ్లను కరోనా రోగుల ఉన్న ఆసుపత్రులకు తీసుకెళ్లాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Mla raja singh) పోలీసులకు విజ్ఙప్తి చేశారు. కింగ్ కోఠి, ఈఎన్‌టీ ఆసుపత్రులను ఆయన సందర్శించి రోగులకు ధైర్యం చెప్పారు.
raja
రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరుగుతున్న వాళ్లను కరోనా రోగుల ఉన్న ఆసుపత్రులకు తీసుకెళ్లాలని పోలీసులకు విజ్ఙప్తి చేశారు. వాళ్ల బాధలను చూసైనా అనవసరంగా బయట తిరగరని అన్నారు. కరోనాను కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరోధించలేవని అది ప్రజల చేతిలోనే ఉందన్నారు. అవసరమైతే తప్పితే బయటకు అనవసరంగా రావద్ధని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.