తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఏడేళ్లయినా ఇంతవరకూ క్రీడాపాలసీలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (Mla Raghunandhan rao) అన్నారు. ప్రభుత్వం స్టేడియాలను ప్రైవేట్ వ్యాపార సంస్థలకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. టిమ్స్(Tims)కు పంచనామా చేసి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వకపోతే ఉద్యమిస్తారని రఘునందర్ రావు స్పష్టం చేశారు.
వచ్చే మంగళవారం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని... క్రీడాకారులంతా (Players) ఆందోళనకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఎల్బీ స్టేడియం (Lb Stadium) పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సోమవారం అసెంబ్లీకి వచ్చే ముందు ఎల్బీ స్టేడియానికి రావాలని తెలిపారు. స్టేడియాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని రఘునందన్ రావు వివరించారు.
ప్రకటించిన టిమ్స్‌కు నిధులు కేటాయించలేదు. సిబ్బందిని నియమించలేదు. గచ్చిబౌలి స్టేడియంలో ఎక్కడైతే వాలీబాల్ టోర్నమెంట్స్ నడుస్తయో... ఎక్కడైతే ఆర్చరీకి సంబంధించిన క్రీడాకారులు ఈరోజు కూడా ప్రాక్టీసు చేస్తరో... ఆ ప్లేస్కొచ్చి గ్రౌండ్ మధ్యలో ఐదెకరాలను పంచనామా చేసి మళ్లీ టిమ్స్‌కు ఇస్తమని పంచనామా చేసిండ్రు ఇది దురదృష్టకరం, బాధకరమైన విషయం. చివరన ఇస్తే బావుంటది కానీ.. మధ్యలో తీసుకొచ్చి ఇది ఇస్తమని పంచనామా చేసిండ్రు. పంచనామా చేయడానికి అధికారులు ఇష్టపడకపోతే రెవెన్యూ అధికారులను బెదిరించి టిమ్స్‌కు ఐదెకరాలకు పంచనామా నిర్వహించి సంతకాలు పెట్టించారు. ఎంత దారుణం అంటే పంచనామాలో సంతకాలు పెట్టింది అధికారులు కాదు. రోడ్డుమీద పోయే దిలీప్‌కుమార్ అనే వ్యక్తిని తీసుకొచ్చి పంచనామా చేయించిండ్రు. రాజు అనే ప్రైవేటు ఎంప్లాయితోటి, చిన్న దుకాణం నడుపుకునే మహేశ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి సంతకాలు పెట్టించిండ్రు.
-- రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే
'ప్రభుత్వ స్టేడియాలు.. ప్రైవేటు వ్యాపార సంస్థలకు ధారాదత్తం' ఇదీ చూడండి:'రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు.. చిరంజీవి, రజనీకాంత్లే కనుమరుగయ్యారు'