రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికలో రోజుకో వాదంతో ప్రజల ముందు తెరాస సరికొత్త వివాదాలను తీసుకువస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికలు రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ సీమాంధ్ర సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. తెరాసకు భాజపా బీ టీం అన్న కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌ను ఎలా కలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడేళ్ల నుంచి దొరకని అపాయింట్మెంట్ ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
నువ్వు బానిసవా.?
ఎమ్మెల్యే బాల్క సుమన్.. నువ్వు తెరాసకు బానిసవా.? తెలంగాణలో అభివృద్ధి, ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా.? ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే వ్యక్తి దుబ్బాకలో విఫలమయ్యాడు.. ఇప్పుడు తెరాస నేతలు ఎవరికి వారే ట్రబుల్ షూటర్‌గా ఫీలవుతున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతోనే సీఎం కేసీఆర్ బయటకు వచ్చి సభలు పెడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్ల సానుభూతి పొంది.. ఇప్పుడు వారితో అవసరం తీరాక విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రావాళ్లు లంకలో పుట్టిన రాక్షసులని ఎద్దేవా చేసిన మీరు.. ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులన్నీ వాళ్లకే ఎందుకు అప్పగిస్తున్నారు.?
రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే