Niranjan Reddy fire on Raghunandan: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. మంత్రి నిరంజన్‌రెడ్డి ఆస్తులపై చేసిన ఆరోపణలు నేపథ్యంలో ఆయన స్పందించారు. పూర్తి పరిజ్ఞానం లేకుండా రఘునందన్‌రావు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. తనకు, తన కుటుంబానికి భూములు ఉన్న ప్రాంతంలో ఆర్డీఎస్ భూములు లేవని పేర్కొన్నారు. ఆయన చెప్పిన సర్వే నంబర్.60లో తమకు 3 ఎకరాల భూమి మాత్రమే ఉందని ప్రకటించారు. ఆర్డీఎస్ కాలువలు ఎక్కడున్నాయో, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడున్నాయో తెలుసుకోవాలని సూచించారు.
39 ఏళ్లుగా ప్రజల మధ్య తాను ఉన్నానని.. తానేంటో ప్రజలకు బాగా తెలుసనని విశ్వాసం వ్యక్తం చేశారు. న్యాయవాదిగా చేసిన రఘునందన్‌రావు ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. తమ భూమి చుట్టూ ప్రహరీగోడ నిర్మించామనటం అబద్ధం అని పేర్కొన్న నిరంజన్‌రెడ్డి.. సర్కారు భూములు కబ్జా చేస్తే గ్రామంలో రైతులు ఊరుకునే పరిస్థితి లేదని అన్నారు. రఘునందన్‌రావు వస్తే.. ఆయన ముందే సర్వే జరిపిస్తామని తెలిపారు. తాము కొన్న భూమి కంటే గుంట భూమి ఎక్కువ ఉన్నా.. ఏ చర్యకైనా సిద్ధమని ప్రకటించారు. రఘునందన్‌రావు ఆరోపణలు తప్పని రుజువైతే ఆయన ఏం చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు.
Raghunandan Rao comments on Niranjan Reddy assets: తమ మొత్తం 90 ఎకరాలు భూమి మాత్రమే ఉందని.. అందులో ఎలాంటి శ్వాశత నిర్మాణాలు లేవని స్పష్టం చేశారు. తమ భూమిలో ఫౌల్ట్రీ, డెయిరీ షెడ్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. తనకు ఉన్న ఆస్తులు మంత్రి పదవి రాకముందు నుంచి ఉన్నవేనని స్పష్టం చేశారు. తనకు ఉన్న ఇల్లు పెద్ద రాజప్రసాదమేమీ కాదని తెలిపిన నిరంజన్‌రెడ్డి.. తన ఇల్లు రఘునందన్‌రావుకు ఇచ్చి.. ఆయన ఇల్లు తాను తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికైనా రఘునందన్‌రావు తన పొరపాటు తెలుసుకుని క్షమాపణ చెప్పాలని కోరారు.
"న్యాయవాదిగా చేసిన రఘునందన్‌రావు ఆధారాలు లేకుండా మాట్లాడారు. నాకు, నా కుటుంబానికి భూములు ఉన్న ప్రాంతంలో ఆర్డీఎస్ భూములు లేవు. రఘునందన్‌రావు చెప్పిన సర్వే నంబర్.60లో మాకు 3 ఎకరాల భూమి మాత్రమే ఉంది. సర్కారు భూములు కబ్జా చేస్తే గ్రామంలో రైతులు ఊరుకునే పరిస్థితి లేదు. రఘునందన్‌రావు వస్తే... ఆయనముందే సర్వే జరిపిస్తాం. నాకున్న ఆస్తులు..మంత్రిపదవి రాకముందు నుంచి ఉన్నవే. నాకున్న ఇల్లు పెద్ద రాజప్రసాదమేమీ కాదు. నా ఇల్లు రఘునందన్‌రావుకు ఇచ్చి.. ఆయన ఇల్లు నేను తీసుకునేందుకు సిద్ధం."- నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి