తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పుడేమో విమర్శలు.. ఇప్పుడు చిలక పలుకులా : రఘునందన్ రావు

MLA Raghunandan Rao comments on Rohit Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల అఫిడవిట్‌లో విద్యార్హతల విషయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని మండిపడ్డారు. తెలంగాణతో, తెలంగాణ ఉద్యమంతో రోహిత్ రెడ్డికి సంబంధం లేదని అన్నారు. ఒకప్పుడు దొరలను విమర్శించిన రోహిత్ రెడ్డి ఇప్పుడు వారి వద్దే చిలక పలుకులు పలికే చిలకగా మారారని ఎద్దేవా చేశారు.

MLA Raghunandan Rao
MLA Raghunandan Rao

By

Published : Dec 19, 2022, 11:50 AM IST

Updated : Dec 19, 2022, 12:57 PM IST

MLA Raghunandan Rao comments on Rohit Reddy : తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై దుబ్బాక శాసనసభ్యుడు, భాజపా నేత రఘునందన్‌రావు ఎదురుదాడి చేశారు. తనపై ఆరోపణలు చేసి... తెరాస నుంచి సస్పెండ్‌ చేశారని.... దీనిపై విచారణ జరపాలని కోరుతున్నా ప్రభుత్వం నడిపే వారు ఎందుకు స్పందించటంలేదని ప్రశ్నించారు. విద్యార్హతల విషయంలో తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించిన రోహిత్‌రెడ్డి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు. రోహిత్‌రెడ్డిపై మాదకద్రవ్యాల కేసు, ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌ల గురించి ముందు మాట్లాడాలని సూచించారు. 2009 కంటే ముందు స్వీడన్‌ వర్సిటీలో చదివినట్లు వివరాలు ఇచ్చారని.. 2018 నాటికి ఇంటర్‌గా ఎలా మారిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

"తెలంగాణతో, తెలంగాణ ఉద్యమంతో రోహిత్ రెడ్డికి సంబంధం లేదు. అదృష్టం కలిసివచ్చిన ఎమ్మెల్యే నాపై విమర్శలు చేస్తున్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో రోహిత్‌రెడ్డి అప్పటి టీఆర్‌ఎస్.. ఇప్పటి బీఆర్‌ఎస్‌ను విమర్శించారు. దొరలు తిరిగే కారు కావాలా? అన్నం తినే చెయ్యి కావాలా? అని అడిగారు. అన్నం తినిపించిన చెయ్యికి సున్నం పెట్టి కాంగ్రెస్‌ను గోదావరిలో ముంచారు. దొరలను విమర్శించి వారి వద్దే చిలక పలుకులు పలికే చిలకగా మారారు. నన్ను అప్పటి టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంపై నాడు అందరినీ అడిగాను. నేను అక్రమంగా సంపాదిస్తే ఎందుకు విచారణ చేయలేదు. నేను తప్పు చేయనందునే ఎలాంటి విచారణ చేయలేదు." అని రఘునందన్ రావు అన్నారు.

Last Updated : Dec 19, 2022, 12:57 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details