MLA Muthireddy Takes Charge As TSRTC Chairman : తనపై నమ్మకంతో ప్రభుత్వం ఆర్టీసీ ఛైర్మన్(RTC Chairman) బాధ్యతను అప్పగించిందని.. తన శక్తి మేరకు సంస్థ వృద్ధికి పాటుపడతానని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులతో పాటు తాను ఒకరిగా సమష్టిగా పని చేసి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడుతానని చెప్పారు. సమష్టి కృషితో సంస్థను లాభాల బాటవైపునకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తానని తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా తనను నియమించిన సీఎం కేసీఆర్‌కు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
TSRTC New Chairman MLA Muthireddy Yadagiri Reddy : టీఎస్ఆర్టీసీ నూతన చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్ భవన్‌లోని తన ఛాంబర్లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఛైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(Muthireddy Yadagiri Reddy) మాట్లాడారు. అనుభవుజ్ఞులైన ఎండీ సజ్జనార్(TSRTC MD Sajjanar) నేతృత్వంలో టీఎస్ఆర్టీసీ అన్ని విభాగాల్లో దూసుకుపోతోందని అన్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు. అయితే జనగామ ఎమ్మెల్యే టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇవ్వాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముత్తిరెడ్డిని బుజ్జగించడానికి.. ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఆయనకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.