వరద ముంపు బాధితులు అధైర్యపడకూడదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని హుస్సేన్‌సాగర్ నాలా పరీవాహక ప్రాంతాలైన నాగమయ్య కుంట, లలిత నగర్, సబర్మతి నగర్, అరుంధతి నగర్, బాపూజీ నగర్, సూరజ్ నగర్ తదితర ప్రాంతాలను కార్పొరేటర్లు ముఠా పద్మ నరేష్, భాగ్యలక్ష్మి హరిబాబు యాదవ్, లాస్య నందితా, హేమలత రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఫోన్ ద్వారా అధికారులను ఆదేశించారు.
అన్ని వేళలా అందుబాటులో ఉంటా: ముఠా గోపాల్ - ముషీరాబాద్‌లో పర్యటించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ వార్తలు
ముషీరాబాద్ నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు. అన్ని వేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు.
అన్ని వేళలా అందుబాటులో ఉంటా: ముఠా గోపాల్
అనంతరం వరద ముంపునకు గురైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లను పంపిణీ చేశారు. వరద ముంపుతో ఏర్పడే సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులు చేసే సూచనలను వరద ముంపు ప్రాంతాల ప్రజలు పాటించాలని కోరారు.