కరోనా నివారణలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కరోనా కట్టడికి భౌతిక దూరంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. మున్సిపల్ సిబ్బందిని ప్రజలు గౌరవించాలన్నారు.
'ప్రజల ఆరోగ్య విషయంలో మున్సిపల్ సిబ్బంది కృషి అనిర్వచనీయం' - ఎమ్మెల్యే ముఠా గోపాల్ వార్తలు
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తోన్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య విషయంలో మున్సిపల్ సిబ్బంది చేస్తున్న కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు. కరోనా కట్టడికి భౌతిక దూరంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు.
MLA MUTA GOPAL
ఈ కార్యక్రమంలో అడిక్మెట్ డివిజన్ కార్పొరేటర్ హేమలత జయరాం రెడ్డి, జీహెచ్ఎంసీ ఏఎమ్‌హెచ్‌ఓ హేమలత, లక్ష్మీ గణపతి దేవాలయం ఛైర్మన్ ముచ్చ కుర్తి ప్రభాకర్, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్