వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా, ప్రతి ఒక్కరు దోమల నివారణకు పాటు పడాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. నియోజకవర్గంలోని గాంధీ నగర్, ఆంధ్రా కేఫ్ చౌరస్తాలో ఆయన పర్యటించారు. దోమల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పించడానికి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
దోమల నివారణకై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ - ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు దోమల నివారణకు పాటు పడాలని ముషీరాబాద్ శాసన సభ్యులు ముఠా గోపాల్ కోరారు. నియోజకవర్గంలోని గాంధీ నగర్, ఆంధ్రా కేఫ్ చౌరస్తాలో జీహెచ్ఎంసీ దోమల నివారణకు ఏర్పాటు చేసిన అవగాహన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
దోమల నివారణకై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
హోటళ్లు, దుకాణాలు, చౌరస్తాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. కరోనా వ్యాపించకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు