తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్ నియమాలను ఉల్లంఘించిన ఎమ్మెల్యే! - హైదరాబాద్​ వార్తలు

ఒకవైపు కరోనా కట్టడికి ప్రభుత్వం విరామం లేకుండా శ్రమిస్తుంటే.. మరోవైపు కొందరు ప్రజాప్రతినిధులు లాక్​డౌన్ నియమాలను తమ ఇష్టారీతిన ఉల్లంఘిస్తున్నారు. భౌతిక దూరం పాటించకుండా జరిపిన బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ వేడుకల్లో కూకట్​పల్లి ఎమ్మెల్యే పాల్గొనడం గమనార్హం.

MLA madhavaram krishnarao, lock down rules break
MLA madhavaram krishnarao, lock down rules break

By

Published : May 13, 2021, 12:16 PM IST

హైదరాబాద్ బాలానగర్​లో కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి లాక్​డౌన్ నియమాలను ఉల్లంఘించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ప్రభుత్వం లాక్​డౌన్ విధించిన మొదటి రోజే ప్రజాప్రతినిధులు ఉల్లంఘించడంపై పలు విమర్శలొస్తున్నాయి. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ద్వారా బాలానగర్ ఏసీపీకి భాజపా నేతలు ఫిర్యాదు చేశారు.

బాలానగర్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి బుధవారం సుమారు 100 మందితో తన జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. భౌతిక దూరం పాటించకుండా టపాసులు పేలుస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఇంటింటి సర్వేలో వెలుగులోకి వచ్చిన కరోనా బాధితులు

ABOUT THE AUTHOR

...view details