జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో గులాబీ జెండాను ఎగరవేశామని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీ ఎన్నికలో 6 వేల మెజారిటీ ఉంటే ఇప్పుడు 30 వేల ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు.
గతంలో కంటే మెజారిటీ పెరిగింది : మాధవరం కృష్ణారావు - కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష
గ్రేటర్ ఎన్నికల్లో కూకట్‌పల్లి ప్రజలు ఏకపక్షంగా తెరాసను గెలిపించారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో గులాబీ జెండాను ఎగురవేశామని తెలిపారు.
గతంలో కంటే మెజారిటీ పెరిగింది : మాధవరం కృష్ణారావు
మూసాపేట్‌లో దాదాపు 1500 ఓట్లను అధికారులు తిరస్కరించడం జరిగిందని అన్నారు. అధికారుల తప్పిదం వల్ల మూసాపేట్ డివిజన్‌లోని రెండు వేల ఓట్లను బాలాజీనగర్‌లో కలపడంతో మెజారిటీ తగ్గిందని తెలిపారు. గ్రేటర్‌లో ప్రచారానికి కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు వచ్చినా ప్రజలు తెరాసకు పట్ట కట్టారని ఎమ్మెల్యే అన్నారు.