తెలంగాణ

telangana

ETV Bharat / state

తహసీల్దార్​ మృతిపై స్పందించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి - ఎమ్మెల్యే జగ్గారెడ్డి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి హత్యపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పలువురు కాంగ్రెస్​ నేతలు స్పందించారు. తహసీల్దార్​పై ఇలాంటి ఘటన జరగడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు.

తహసీల్దార్​ మృతిపై స్పందించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

By

Published : Nov 4, 2019, 8:19 PM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం బాధాకరమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్ర రెవెన్యూ అధికారులపై ధర్మగంట పేరుతోఓ పత్రిక తెలంగాణ ప్రజల్లో విషాన్ని నూరిపోసిందని ఆయన ఆరోపించారు. పాత రెవెన్యూ చట్టంలో రైతులకు-అధికారులకు మధ్య వెసులుబాటు ఉండేదని... రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ చేసిన మార్పులు అధికారులకు-రైతులకు మధ్య వైరాన్ని సృష్టించాయన్నారు.

కొంతకాలంగా రెవెన్యూ ఉద్యోగులపై ప్రజల్లో విద్వేషం పెరిగేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని కాంగ్రెస్​ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద, పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీనియర్‌ నేత హనుమంతురావు ఆరోపించారు. విజయారెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు.

తహసీల్దార్​ మృతిపై స్పందించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఇదీ చూడండి: ఇకపై రైరై... హైదరాబాద్​లో మరో పైవంతెన ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details