తెరాస సర్కార్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. క్వశ్చన్ అవర్‌లో ప్రతిపక్షానికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదని మండిపడ్డారు. ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనాలకు ట్రాఫిక్ చలానాలు అధికంగా విధిస్తున్నారని ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసులకు ప్రభుత్వం టార్గెట్ విధించినట్లు తెలుస్తోందన్నారు. హైదరాబాద్‌లోని గన్‌పార్కు మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో చలానాలు విధించడం అవసరమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే చలానా విధించే విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
క్వశ్చన్ అవర్‌లో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వట్లే: జగ్గారెడ్డి - అసెంబ్లీ సమావేశాలు
కరోనా విపత్కర పరిస్థితుల్లోను కేసీఆర్ ప్రభుత్వం ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ట్రాఫిక్ చలానా విధిస్తున్నారని.. ఆ విధానాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/14-September-2020/8795729_784_8795729_1600076840608.png