MLA Harish Rao vs Minister Uttam Kumar Reddy in Assembly :మోటార్లకు మీటర్లు అంశంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Harishrao vs uttam kumar Reddy)ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అనగా, ఆ మాటలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందా లేదా అని హరీశ్‌రావు ప్రశ్నించగా, విద్యుత్ బిల్లులు కట్టమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని మంత్రి అన్నారు. శనివారం వాయిదా అనంతరం బుధవారం ప్రారంభమైన శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య స్వల్ప ఉద్రిక్తత జరిగింది. గత ప్రభుత్వం చేసిన పనులపై శ్వేతపత్రాలను(White Paper) విడుదల చేస్తుండగా యుద్ధం జరిగింది.
"మేము అప్పులు తీసుకోవాలనుకుంటే విద్యుత్ సవరణల విషయంలో కేంద్ర ప్రభుత్వం 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎంలో వెసులుబాటు కల్పిస్తామని చెప్పింది. నిజంగా మాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే అప్పులే ముఖ్యమని అనుకుంటే రూ.35 వేల కోట్లు అదనంగా వచ్చేవి. నాటి కేంద్ర ప్రభుత్వం షరతుల్లో బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టించి, కరెంటు బిల్లులు వసూలు చేయాలని నిర్ణయిస్తే కేసీఆర్ వ్యతిరేకించారు. ఈ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిధులను తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం."- హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
ఎఫ్‌ఆర్‌బీఎం(FRBM) నిధుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టేందుకు అంగీకరించవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) విజ్ఞప్తి చేశారు. మీటర్లు పెడితే కేంద్రం నుంచి రూ.35 వేల కోట్లు వచ్చేవని మాజీ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో చెప్పారు. 70 లక్షల మంది రైతుల క్షేమం కోసం మాత్రమే తాము మీటర్లకు అంగీకరించలేదని స్పష్టం చేశారు. అనంతరం మైక్ అందుకున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీశ్‌రావుపై విరుచుకుపడ్డారు. ఆయన చెప్పేవన్నీ అవాస్తవాలేనని మండిపడ్డారు.
రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా దిల్లీలో నూతన తెలంగాణ భవన్ : సీఎం రేవంత్ రెడ్డి