తెలంగాణ

telangana

ETV Bharat / state

'బ్లాక్ మెయిల్ రాజకీయాలు వద్దు...సలహాలివ్వండి' - Kalyana Lakshmi cheques

ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షాలు సలహాలివ్వాలే కాని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయవద్దని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. సోమాజిగూడ పరిధి బీఎస్‌లోని లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌‌ చెక్కులు పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్
MLA Danam Nagender

By

Published : Dec 25, 2020, 9:37 AM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌లకు పోలీసులను అధికారులను విమర్శించడం ఓ ఫ్యాషన్‌గా మారిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షాలు సలహాలివ్వాలే కాని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయవద్దని కోరారు.

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. సోమాజిగూడ పరిధి బీఎస్‌ మక్తాలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కొత్త వైరస్​ స్ట్రెయిన్​కు వ్యాక్సినే విరుగుడు

ABOUT THE AUTHOR

...view details