తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కావడానికి అన్ని అర్హతలున్న వ్యక్తి కేటీఆర్ : దానం - ktr to become telangana cm

ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్​కు ఉన్నాయని ఖైరతాబాద్​ ఎమ్మెల్యే నాగేందర్ అన్నారు. త్వరలోనే కేటీఆర్ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

mla-danam-nagender-about-ktr-becoming-chief-minister-of-telangana
సీఎం కావడానికి అన్ని అర్హతలున్న వ్యక్తి కేటీఆర్

By

Published : Jan 23, 2021, 3:54 PM IST

కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. భాజపా మతతత్వ రాజకీయాలకు పూర్తిస్థాయిలో చెక్​ పడుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మతపరమైన వివాదాలు తెరపైకి తీసుకొచ్చి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు మంత్రి కేటీఆర్​కు ఉన్నాయని దానం పేర్కొన్నారు. త్వరలోనే కేటీఆర్ సీఎం గద్దెనెక్కుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్ అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ.. హైదరాబాద్ నందినగర్​ మైదానంలో.. కేసీఆర్, కేటీఆర్​ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ABOUT THE AUTHOR

...view details