బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా బంజారాహిల్స్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ పండుగకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రధాన్యత ఇస్తుందని ఆయన వెల్లడించారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కృషితో మన బతుకమ్మ పండుగ గురించి ప్రపంచానికి తెలిసేలా చేశారని దానం కొనియడారు.
'బతుకమ్మ... తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం' - బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన దానం నాగేందర్
హైదరాబాద్ బంజారాహిల్స్లో బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ నిలువుటద్దం: దానం నాగేందర్