తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో జపాన్​ వనాలు!

గ్రేటర్‌లో జపాన్‌ తరహా వనాలు అభివృద్ధి కాబోతున్నాయి. జపాన్‌లో ప్రాచుర్యం పొందిన గుబురు అడవుల అభివృద్ధి విధానం ‘మియావకి ప్లాంటేషన్‌’ పద్ధతిలో నగరంలోని ఆరు ప్రాంతాల్లో వనాలు పెంచేందుకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేసింది.

miyavaki plantation will establish in hyderabad coming soon
హైదరాబాద్​లో జపాన్​ వనాలు!

By

Published : Jun 6, 2020, 7:55 AM IST

Updated : Jun 6, 2020, 8:47 AM IST

హైదరాబాద్​ మహానగరంలో జపాన్​ వనాలు పెంచబోతున్నారు. జపాన్‌లో ప్రాచుర్యం పొందిన మియావకి ప్లాంటేషన్‌’ పద్ధతిలో నగరంలోని ఆరు ప్రాంతాల్లో వనాలు పెంచేందుకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేసింది. ఒకే చోట ఐదుకు మించి మొక్కలు నాటడం వల్ల చెట్లు దట్టంగా పెరుగుతాయి. మియావకి అడవులకు కేటాయించిన 1.5 లక్షల మొక్కలతో కలిపి ఐదో విడత హరితహారంలో 35 లక్షల మొక్కలు నాటాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది.

జూన్‌ 20న కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ బల్దియా యంత్రాంగానికి సూచించడం వల్ల జీవ వైవిధ్య విభాగం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ దఫా అధికశాతం దేశీయ మొక్కలు నాటనున్నామని అధికారులు తెలిపారు. కొత్త మున్సిపల్‌ చట్టంలోని నిబంధనలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు చేపడతామన్నారు.

ఇదీ చూడండి:పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?

Last Updated : Jun 6, 2020, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details