మిషన్ భగీరథ నిర్వహణ విధానంపై గత మూడు రోజులుగా జరుగుతున్న సదస్సు ముగిసిందని చీఫ్ ఇంజినీర్ కృపాకర్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తాగునీరు సరాఫరా చేసేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామన్నారు. ప్రతి ఇంటికి శుద్ధి చేసిన మంచి నీటిని అందించే బాధ్యత ఇంజినీర్లదేనని స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీటి కష్టాలు ఉండొద్దన్న సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరాలంటే... నిరంతరాయంగా సరఫరా చేయాలన్నారు. ఇందుకోసం విశ్రాంత ఇంజినీర్లు, ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి సలహాలు, సూచనలను తీసుకుంటున్నామని కృపాకర్‌రెడ్డి వెల్లడించారు.